పలువురు ఐఏఎస్ లను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

By -  Nellutla Kavitha |  Published on  19 May 2022 7:07 PM IST
పలువురు ఐఏఎస్ లను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. వివరాలు ఇలా ఉన్నాయి.

చేనేత, జౌళిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను నియమించింది. రవాణాశాఖ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌కు, రిజిస్ట్రేషన్‌, స్టాంపుల కమిషనర్‌గా రాహుల్‌ బొజ్జాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. విద్యాశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణను బదిలీ చేయగా, ఔషధ నియంత్రణ సంచాలకులుగా రిజ్వీకి అదనపు బాధ్యతలు, జీడీఏ కార్యదర్శిగా వీ. శేషాద్రికి అదనపు బాధ్యతలు, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ కార్యదర్శిగా సందీప్‌ కుమార్‌ సుల్తానియాకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

Next Story