భావోద్వేగాలు కలబోసిన 'గమనం'

Gamanam Trailer Release. హీరోయిన్లు శ్రియా శరణ్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తెర‌కెక్కుతున్న చిత్రం గ‌మ‌నం.

By Medi Samrat  Published on  11 Nov 2020 11:23 AM IST
భావోద్వేగాలు కలబోసిన గమనం

హీరోయిన్లు శ్రియా శరణ్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తెర‌కెక్కుతున్న చిత్రం గ‌మ‌నం. సుజ‌నారావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం మొత్తం ఐదు బాష‌ల్లో(తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ) రూపొందుతోంది. 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంక జవాల్కర్ - శివ కందుకూరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా పోస్ట‌ర్లు అంచ‌నాల‌ను పెంచాయి. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను ఈ రోజు విడుద‌ల చేశారు. తెలుగు ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేయగా హిందీ ట్రైలర్ ను సోనూసూద్ తమిళ ట్రైలర్ ను జయం రవి కన్నడ ట్రైలర్ ను శివ రాజ్ కుమార్ మలయాళంలో ఫహద్ ఫాసిల్ విడుదల రిలీజ్ చేశారు.

ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. మూడు వేరు వేరు కథలను తీసుకొని ఈ రియల్ లైఫ్ డ్రామాను రూపొందించినట్లు తెలుస్తోంది. శ్రియా చెవిటి మహిళగా.. దుబాయ్ కి వెళ్లిన భర్త కోసం ఎదురు చూసే సాధారణ గృహిణి పాత్రలో కనిపిస్తోంది. కానీ అతన దుబాయ్ లోనే వేరే అమ్మాయిని వివాహం చేసుకొని శ్రియా ను వదిలేసినట్లు తెలుస్తోంది. అలానే ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఆడాలని కలలు కనే ముస్లిం యువకుడిగా శివ కందుకూరి.. అతని గర్ల్ ఫ్రెండ్ గా ప్రియాంక జవాల్కర్ నటించింది. బర్త్ డే సెలెబ్రేట్ చేసుకోవడానికి ఆశ పడే అనాథ వీధి బాలలను కూడా ఈ ట్రైలర్ లో చూపించారు. నిత్యా మీనన్ గాయనిగా నటించినట్లు అర్థ‌మ‌వుతోంది.

ప్రముఖ రచయిత సాయి మాధవ్‌ బుర్రా మాటలు సమకూర్తుండగా.. జ్ఞాన శేఖర్‌ వీఎస్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. రమేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పుల‌తో క‌లిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉంది.


Next Story