గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. కాగా వంశీ ఇంటికి పోలీసులు నోటీసులు అంటించి విజయవాడకు తరలించారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బీఎన్‌ఎస్ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్‌విత్ 3(5) కింద వంశీపై కేసు నమోదు చేశారు.
వల్లభనేని వంశీ ప్రస్తుతం పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారని పోలీసులు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీని ఏ71గా పోలీసులు చేర్చారు. బాపులపాడు మండలం ఆరుగొలనులో టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు షాపులను అక్రమంగా కూల్చివేసిన కేసులో ఏ2గా ఉన్నారు.
ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్‌లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు.