ఆడియో లాంఛ్ ప్రోగ్రామ్‌లో నిత్యామీనన్ తీరుపై విమర్శలు
టాలీవుడ్‌లో మంచి ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్ నిత్యామీనన్ తాజాగా విమర్శలను ఎదుర్కొంటున్నారు.
By Knakam Karthik Published on 10 Jan 2025 1:35 PM ISTఆడియో లాంఛ్ ప్రోగ్రామ్‌లో నిత్యామీనన్ తీరుపై విమర్శలు
టాలీవుడ్‌లో మంచి ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్ నిత్యామీనన్ తాజాగా విమర్శలను ఎదుర్కొంటున్నారు. చెన్నైలో జరిగిన ఓ మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో ఆమె ప్రవర్తనపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. ఇక విషయానికొస్తే జయం రవి, నిత్యామీనన్ జంటగా నటించిన కాదలిక్క నేర మిళ్లై మూవీ ఈ నెల 14వ తేదీన రిలీజ్ కానుంది. అయితే దీనికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ ప్రోగ్రామ్‌లో ఈవెంట్ ఆర్గనైజర్ల పట్ల నిత్యామీనన్ వైఖరిపై ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు.
ఆడియో లాంఛ్ పంక్షన్‌లో నిత్యామీనన్ వేదికపై వచ్చారు. అదే సమయంలో ఈవెంట్ ఆర్గనైజర్ నిత్యామీనన్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించింది. తనకు ఆరోగ్యం బాగా లేదని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపైనే ప్రేక్షుకులు నిత్యామీనన్‌ను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె స్టేజిపైకి రాకముందు జయం రవి, మరో వ్యక్తికి హగ్ ఇచ్చిన క్లిప్‌లు సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో కలిసి తిరు మూవీలో నటించిన నిత్యా మీనన్‌కు కోలీవుడ్ ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. అయితే ఇప్పుడు ఈ ఇష్యూతో ఆమె వైఖరిపై కోలీవుడ్ మూవీ లవర్స్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
உதவியாளர் கைகொடுக்கா வந்தா உடம்பு முடியலனு சொல்லி தவிர்த்துட்டு நடிகர்களோட ரொம்ப நெருக்கமா பாசத்த காட்றாங்க நித்யாமேனன். ஏன் ஜெயம் ரவி, வினய்கலாம் கொரோனா பரவாதா ?#Nithyamenon #KadhalikkaNeramillai pic.twitter.com/q18ADw9Jq0
— Spicy Chilli (@SpicyChilli4U) January 8, 2025