మోదీ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వం
By - Nellutla Kavitha | Published on 21 March 2022 12:10 PM GMTధాన్యం సేకరణ విషయంలో దేశమంతా ఒకే విధానం ఉండాలి, రాష్ట్రానికో విధానం ఉండకూడదు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. రైతుల జీవన్మరణ సమస్య కాబట్టి 100% కేంద్రం ధాన్యం కొనేదాకా పోరాటం చేస్తామన్నారు కెసిఆర్. పోరాటాలు చేయడం టిఆర్ఎస్ కు కొత్తేమీ కాదని వన్ నేషన్ వన్ ప్రో క్యూర్ మెంట్ ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకోసం అన్ని గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తానని, రేపు మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్తుందని, ఉగాది తర్వాత రైతు ధర్నా ఉంటుందని అందులో తాను కూడా పాల్గొంటానని, అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు కెసిఆర్. ఇక ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి తాను ముందుగానే చెప్పానని అక్కడ సీట్లు తగ్గుతాయని సీట్లతో పాటు ఉత్తరాఖండ్లో కూడా అదే ఫలితం వచ్చింది అన్నారు కేసీఆర్. ఇక హిందీ సినిమా ద కాశ్మీర్ ఫైల్స్ పై మండిపడ్డారు సీఎం. ఓట్ల కోసం కొత్త నాటకానికి తెర తీస్తున్నారని, ఉద్యోగులకు సెలవులు ఇచ్చి మరి సినిమా చూడమని చెప్పడం ఏంటని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు కెసిఆర్. SC వర్గీకరణ ని, రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు బాగాలేదని, అసమర్థ ప్రభుత్వం పోవాల్సిన అవసరం వచ్చిందని అన్నారు కేసీఆర్. తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటే భంగ పడతారని, రైతులకు రాజ్యాంగ పరిరక్షణ రావాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్. కరోనా నియంత్రణలో కేంద్రం విఫలమైందని, ఎనిమిదేళ్లలో ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు రాలేదని కెసిఆర్ ఫైర్ అయ్యారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం తగ్గుతుందని, కేంద్రంలో ఉన్న బిజెపిని ఇంటికి పంపిస్తామని అన్నారు కేసీఆర్. జాతీయ రాజకీయాల్లో బహుముఖీన పరివర్తన రావాల్సిన అవసరం ఉందని, అందుకు అవసరమైన రోల్ ప్లే చేస్తానని అన్నారు కేసీఆర్. దేశ రాజకీయాల్లో మార్పు, పరివర్తన రావాల్సిన అవసరం ఉందని, అందుకోసం తాను అద్భుతమైన పాత్ర పోషిస్తానని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో శూన్యత ఉన్నదని జాతీయ పార్టీ వచ్చే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు కేసీఆర్.