ఎలక్టోరల్ బాండ్స్: 2023లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కాంగ్రెస్‌కు రూ.30 కోట్లు ఎందుకు విరాళంగా ఇచ్చారు?

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కంపెనీ ఆర్‌పిపిఎల్ 2023 జనవరి- ఏప్రిల్ మధ్య కాంగ్రెస్ కి రూ. 30 కోట్లు విరాళంగా ఇచ్చింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 March 2024 5:50 AM GMT
bjp, mp cm ramesh, donate, rs 30 crores,  congress,

ఎలక్టోరల్ బాండ్స్: 2023లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కాంగ్రెస్‌కు రూ.30 కోట్లు ఎందుకు విరాళంగా ఇచ్చారు?

సిట్టింగ్ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌పిపిఎల్) 2023 జనవరి- ఏప్రిల్ మధ్య కాంగ్రెస్ పార్టీకి రూ. 30 కోట్లు విరాళంగా ఇచ్చింది. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత ఎస్‌.బీ.ఐ. ఇటీవల ఎలక్టోరల్ బాండ్ల డేటాను వెల్లడించింది. కాషాయ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్‌కు నిధులు సమకూర్చడం ఆసక్తికరంగా మారింది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్చి 21న ఎలక్టోరల్ బాండ్ దాతల జాబితాను బయట పెట్టగా.. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కాంగ్రెస్‌కు రూ.30 కోట్లు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

రిత్విక్ ప్రాజెక్ట్స్ ఎవరితో భాగస్వామిగా ఉంది?

విరాళాలు ఇచ్చిన సమయం ముఖ్యమైనది. 1,098 కోట్ల విలువైన సున్నీ డ్యామ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ కోసం రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హిమాచల్ ప్రదేశ్ ఆధారిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ (PSU)తో ఎంఓయూపై సంతకం చేసిన తర్వాత బాండ్లు కొన్నారు. మొత్తంగా, రిత్విక్ ప్రాజెక్ట్స్ రూ. 45 కోట్ల విలువైన బాండ్లను సేకరించింది, వీటిలో ఎక్కువ వాటా భారత జాతీయ కాంగ్రెస్‌కు, రూ. 10 కోట్లు కర్ణాటకకు చెందిన ప్రాంతీయ పార్టీ జనతాదళ్ (సెక్యులర్)కి, రూ. 5 కోట్లు తెలుగుదేశం పార్టీకి (టీడీపీ) వెళ్లాయి.

రిత్విక్ ప్రాజెక్ట్స్ ఏమి చేస్తుంది?

రిత్విక్ ప్రాజెక్ట్స్ మైనింగ్, పవర్, ఇరిగేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పనుల్లో నిమగ్నమై ఉంది. 1999లో స్థాపించిన ఈ సంస్థ అనేక ప్రభుత్వ ప్రాజెక్టులను పొందింది. ఈ కంపెనీకి నలుగురు డైరెక్టర్లు వెంకటేశ్వరరావు దామర్ల, రాఘవరావు దామర్ల, బెనాయిట్ సెర్జ్ మారిస్ లాబోరీ, వి దమర్ల నాయకత్వం వహిస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్న బీజేపీ ఎంపీ సీఎం రమేష్ 2019లో రూ.100 కోట్లకు సంబంధించిన కేసులో ఆదాయపన్ను శాఖ విచారణను ఎదుర్కొన్నారు. ఈ కేసు ప్రకారం.. సీఎం రమేష్ కంపెనీ అక్రమ లావాదేవీల ద్వారా రూ. 74 కోట్లు స్వాహా చేసిందని ఆరోపణలు వచ్చాయి. వాటిలో రూ. 25 కోట్ల బిల్లులు నకిలీవని తేలింది. హైదరాబాద్‌లోని ఆయన కంపెనీ, కడపలోని ఆయన నివాసంపై ఐటీ శాఖ దాడులు చేసింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత రమేష్‌తో పాటు మరో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి బీజేపీలోకి వెళ్లారు. ఇద్దరికీ రాజ్యసభ ఎంపీ పదవులు ఇచ్చారు.


చాలా పార్టీలకు మేఘా సంస్థ విరాళాలు:

భారతదేశంలోని 54వ అత్యంత సంపన్నుడు పివి కృష్ణారెడ్డికి చెందిన హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (MEIL) మొత్తం రూ. 1,232 కోట్లు విరాళంగా ఇచ్చింది. నిధులు BJP, BRS, DMK, YSRCP, RDP, INC, బీహార్ ప్రదేశ్ జనతాదళ్ (యునైటెడ్), జనతాదళ్ (సెక్యులర్), జనసేన పార్టీ లకు చేరాయి. నిధులు పొందిన తొమ్మిది పార్టీల్లో బీజేపీకి రూ.584 కోట్ల సింహభాగం రాగా, బీఆర్‌ఎస్ రూ.195 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. MEIL కూడా FY 2023లో ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్‌కి రూ. 87 కోట్లు విరాళంగా ఇచ్చింది.


యశోద హాస్పిటల్స్ విషయంలో కన్ఫ్యూజన్:

హైదరాబాద్‌కు చెందిన యశోద గ్రూప్ యాజమాన్యం ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిందనే విషయాన్ని తీవ్రంగా ఖండించింది. ఆ సంస్థ నుండి ఒక WhatsApp సందేశం “దురదృష్టవశాత్తూ, మా హాస్పిటల్ పేరు కొన్ని మీడియా సంస్థల్లో తప్పుగా ప్రచురించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో న్యూ ఢిల్లీకి అతి సమీపంలో మరొక యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. చాలామంది ఆ సంస్థతో మా సంస్థను పోల్చారు." అని వివరణ వచ్చింది.

BRS పార్టీకి అత్యధిక విరాళాలు ఇచ్చిన రెండో సంస్థగా యశోద గ్రూప్ నిలిచింది. ఈ గ్రూపు బీఆర్‌ఎస్‌కు రూ.94 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.64 కోట్లు, బీజేపీకి రూ.2 కోట్లు, వైఎస్సార్‌సీపీకి రూ.1 కోటి, ఆప్‌కు కూడా ఒక కోటి రూపాయలు అందించింది.

BRS కు వచ్చిన విరాళాలు:

1. MEIL: రూ. 150 కోట్లు

2. యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్: రూ. 94 కోట్లు

3. చెన్నై గ్రీన్ వుడ్స్: రూ. 50 కోట్లు

4. MEIL: రూ. 45 కోట్లు

5. డాక్టర్ రెడ్డీస్: రూ. 32 కోట్లు

6. హెటెరో గ్రూప్: రూ. 30 కోట్లు

7. IRB: రూ. 25 కోట్లు

8. వి బాలవీరయ్య: రూ 25 కోట్లు

9. NSL సెజ్ (హైదరాబాద్): రూ. 24 కోట్లు

10. ఎల్7: రూ. 22 కోట్లు

YSRCP కి వచ్చిన విరాళాలు:

1. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్స్: రూ. 154 కోట్లు

2. MEIL: రూ. 37 కోట్లు

3. రామ్‌కో సిమెంట్స్: రూ. 24 కోట్లు

4. OSTRO: రూ. 17 కోట్లు

5. OSTRO (జైసల్మేర్): రూ 17 కోట్లు

6. వేదాంత: రూ. 13 కోట్లు

7. స్నేహ కైనెటిక్: రూ. 10 కోట్లు

8. రమేష్ అగర్వాల్: రూ. 9 కోట్లు

9. లక్ష్మి ఇందు: రూ. 8 కోట్లు

10. జ్యోస్త్నా అగర్వాల్: రూ. 7 కోట్లు

టీడీపీకి దాతలు:

1. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్: రూ. 40 కోట్లు

2. MEIL: రూ. 28 కోట్లు

3. వెస్ట్రన్ UP పవర్ ట్రాన్స్‌మిషన్ (MEIL): రూ. 20 కోట్లు

4. RK ఇన్‌ఫ్రా: రూ. 16 కోట్లు

5. నాట్కో ఫార్మా: రూ. 14 కోట్లు

6. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్: రూ. 10 కోట్లు

7. భారత్ బయోటెక్: రూ. 10 కోట్లు

8. శ్రీ సిద్ధార్థ్: రూ. 9 కోట్లు

9. ప్రిసమ్: రూ. 9 కోట్లు

10. అరబిందో గ్రూప్: రూ. 7 కోట్లు

Next Story