హైదరాబాద్‌తో తెగిన ఆంధ్రప్రదేశ్‌ బంధం

తెలుగు రాష్ట్రాల విభజన జరిగి నేటితో పదేళ్లు అయ్యాయి.

By Srikanth Gundamalla  Published on  2 Jun 2024 4:14 AM GMT
Andhra Pradesh,   Hyderabad, telangana,

హైదరాబాద్‌తో తెగిన ఆంధ్రప్రదేశ్‌ బంధం 

తెలుగు రాష్ట్రాల విభజన జరిగి నేటితో పదేళ్లు అయ్యాయి. తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడిగా ఉన్నప్పుడు రాజధానిగా హైదరాబాద్‌ ఉన్న విషయం తెలిసిందే. ఏపీలో కొత్త రాజధాని నిర్మాణం చేసుకునే వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని విభజన సమయంలో చెప్పారు. దీనికి పదేళ్ల సమయం కూడా నిర్ణయించారు. తాజాగా ఆ పదేళ్లు పూర్తవడంతో హైదరాబాద్‌తో ఏపీకి ఉన్న బంధం తెగిపోయినట్లు అయ్యింది. భాగ్యనగరితో రాజ్యాంగ, చట్టపరంగా ఉన్న బంధం తెగింది.

పదేళ్లు ఉమ్డి రధానిగా హైదరాబాద్‌ కొనసాగినా ఆంధ్రాకు మాత్రం జీరో ప్రయోజనం. 2015లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న చంద్రబాబు హైదరాబాద్‌ను వదిలేసి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయారు. అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అంతేకాదు.. తాత్కాలిక హైకోర్టు.. తాత్కాలిక సచివాలయం.. ఇతర భవనాలను కూడా నిర్మించుకున్నారు. దాంతో.. పాలన పరంగానే హైదరాబాద్‌తో ఏపీకి బంధం తెగిపోయింది. ఇక ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తాడేపల్లి నుంచి పాలన సాగించారు తప్ప.. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో కూర్చొని ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఎలా చూసినా కూడా పాలన పరంగా ఏపీకి హైదరాబాద్ ఎప్పుడో దూరమైంది. అంతేకాదు.. వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని విషయంలో తమ పంథాను మార్చుకుంది. అమరావతి మాత్రమే కాదు.. రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండాలనే అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇక దాంతో.. మరోసారి ఆ రాష్ట్ర ప్రజలు రాజధాని విషయంలో సందిగ్దంలో పడ్డారు. ఇప్పటికీ రాజధాని విషయం తేలలేదు. ఇప్పుడు తాజాగా ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? ఆ తర్వాత రాజధాని విషయం ఎంతమేర ముందుకెళ్తుందనేది చూడాలి.

కాగా.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మాత్రం హైదరాబాద్‌తో రాజ్యాంగ పరంగా ఉన్న బంధాన్ని ఇప్పుడే తెంచకూడదని అంటున్నారు. మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలని కోరుతున్నారు.

Next Story