మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మైనర్లకు 4 రోజుల కస్టడీ

Four Days Custody In Minor Girl Gang Rape Case

By -  Nellutla Kavitha |  Published on  9 Jun 2022 6:18 PM IST
మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మైనర్లకు 4 రోజుల కస్టడీ

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్‌రేప్‌ కేసులో నిందితులైన మైనర్లను 4 రోజుల కస్టడీలోకి పోలీసులు తీసుకోనున్నారు ఆమ్నిషియా పబ్‌ కేసులో జువనైల్స్‌ని కస్టడీకి అనుమతించింది కోర్టు. రేపటి నుంచి 4 రోజుల పాటు నిందితులను పోలీసులు విచారించేందుకు కస్టడీకి అనుమతిచ్చింది.

14వ తేదీ సాయంత్రం వరకు పోలీస్‌ కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి 4 రోజుల పాటు మైనర్లను పోలీసులు విచారించనున్నారు. ఈ కేసులో భాగంగా ఇప్పటికే సాదుద్దీన్ మాలిక్‌ను విచారిస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఐదుగురిని కలిపి రేపటి నుంచి విచారించబోతున్నారు పోలీసులు.

Next Story