ఉద్యమకారులున్న బీజేపీలోకి రావటం ఘర్ వాపసీని తలపిస్తోంది : బూర నర్సయ గౌడ్

Ex MP Boora Narsaiah Goud Joining BJP On 19th Of This Month In Delhi

By -  Nellutla Kavitha |  Published on  17 Oct 2022 7:33 AM GMT
ఉద్యమకారులున్న బీజేపీలోకి రావటం ఘర్ వాపసీని తలపిస్తోంది : బూర నర్సయ గౌడ్

టీఆర్ఎస్ మాజీ ఎంపీ, ఇటీవలే ఆ పార్టీ కి గుడ్ బై చెప్పిన సీనియర్ నేత కమలం కండువా కప్పుకోవడానికి ముహూర్తం వెల్లడించారు. ఈనెల 19న బీజేపీలో చేరబోతున్నట్టుగా ప్రకటించారు బూర నర్సయ్య గౌడ్. ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ బండి సంజయ్, తరుణ్ చుగ్, కేంద్ర మంత్రుల సమక్షంలో చేరనున్నారు బూర నర్సయ్య. ఈ నేపథ్యంలోనే బూర నర్సయ్య నివాసానికి బండి సంజయ్ తో పాటుగా ఇతర నేతలు వెళ్లారు.

టీఆర్ఎస్ లో అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు బూర నర్సయ్య గౌడ్. అడిగితే కేసీఆర్ కనీసం అపాయిట్ మెంట్ కూడా ఇవ్వలేదని బూర నర్సయ్య ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన అన్నారు.

రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీలో చేరుతున్నానని, కేసీఆర్ ను కలవటం‌ టీఆర్ఎస్ నేతలకు ఒక ఉద్యమంలా మారిందని బూర నర్సయ్య ఎద్దేవా చేసారు. భువనగిరి పార్లమెంట్ అభివృద్ధిలో కేంద్రం పాత్ర ఉందని, పార్టీలకు అతీతంగా మోదీ ప్రభుత్వం, అభివృద్ధికి సహకరించిందని ఆయన అన్నారు.

తన రాజకీయ జీవితం కోసం కాకుండా రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీలో చేరుతున్నానని, ఫైర్ బ్రాండ్ బండి సంజయ్, నడ్డా, అమిత్ షాలు ఆహ్వానం మేరకు బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని, సబ్ కా సాత్ - సబ్ కా వికాస్ - సబ్ కా విశ్వాస్ అన్న నినాదం తనకు నచ్చిందని చెప్పిన బూర నర్సయ్యగౌడ్ ఉద్యమకారులున్న బీజేపీలోకి రావటం, ఘర్ వాపసీని తలపిస్తోందని అన్నారు.

Next Story