టీఆర్‌ఎస్‌ నేతకు ఎన్నికల కమిషన్ నోటీసులు

Election Commission Issues Notices To TRS Leader

By -  Nellutla Kavitha |  Published on  13 Oct 2022 10:26 AM GMT
టీఆర్‌ఎస్‌ నేతకు ఎన్నికల కమిషన్ నోటీసులు

వరంగల్ టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి కి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సీయం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు ప్రకటన సందర్భంగా, దసరా పండుగకు ముందురోజు స్థానిక హమాలీలకు రాజనాల శ్రీహరి మద్యం, కోళ్లు పంపిణీ చేశారు. కేసీఆర్ కొత్తపార్టీ పెట్టబోతున్న సందర్భంగా మద్యం పంపిణీ చేసినట్టు ఆయన వెల్లడించారు. సీయం కేసీఆర్, మంత్రికేటీఆర్ భారీ కటౌట్ల ముందే శ్రీహరి మద్యం పంపిణీ చేశారు. ఈ వ్యవహారంపై సామజిక మాధ్యమాలతో పాటుగా జాతీయ మీడియాల్లో కూడా వరుస కథనాలు ప్రసారం అయ్యాయి.

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మద్యం పంపిణీ చేస్తున్నారంటూ ఈసీకి స్థానికులు ఫిర్యాదు చేశారు. కథనాలు, స్థానికుల ఫిర్యాదుపై స్పందించి ఈసీ శ్రీహరి మందు పంపిణీకి సంబంధించి వివరణ ఇవ్వాలని వరంగల్ కలెక్టర్‌ను కోరింది. అలాగే రాజనాల శ్రీహరికి నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Next Story