తెలంగాణ అమ్రిష్ పురి కేసీఆర్ - బండి సంజయ్

CM KCR Is Telangana’s Amrish Puru Says MP Bandi Sanjay

By -  Nellutla Kavitha |  Published on  9 Oct 2022 8:41 PM IST
తెలంగాణ అమ్రిష్ పురి కేసీఆర్ - బండి సంజయ్

సీయం కేసీఆర్, ఈ మధ్య మంత్రగాడి అవతారమెత్తిండని ఇంకా చెప్పాలంటే తెలంగాణ అమ్రిష్ పురి లెక్క మారిండని అన్నారు ఎంపీ బండి సంజయ్. నక్సలైట్లకే ఎదురొడ్డి పోరాడిన పార్టీ బీజేపీ అని కేసీఆర్ లాంటి తాంత్రికులకు భయపడతదా? అని నర్సాపూర్ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రసంగించారు.

ఒక స్వామీజీ సెక్రటేరియట్ కు పోవద్దని చెప్పగానే కేసీఆర్ సెక్రటేరియట్ కు వెళ్లకుండా ఉన్నాడని, మంత్రగాడు చెప్పగానే సెక్రటేరియట్ కూలగొట్టి కొత్తది కడుతున్నాడని, ఆ తాంత్రికుడు చెప్పడంతోనే టీఆర్ఎస్ పేరును కూడా బీఆర్ఎస్ గా మార్చిండని అన్నారు సంజయ్. ఇక ఆ తాంత్రికుడి చేతుల్లో తెలంగాణను పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని, నర్సాపూర్ గడ్డ పౌరుషాల గడ్డ, ఇక్కడి యువకుల రక్తం సలసల కాగుతోందని, ఎప్పుడెప్పుడు ఎన్నికలొస్తాయా? కేసీఆర్ కు ఎప్పుడెప్పుడు గుణపాఠం చెప్పాలనే కసి వాళ్లలో కన్పిస్తోందని సభలో ప్రసంగించారు సంజయ్.

వందలమంది యువకుల బలిదానంతో తెలంగాణ సాధిస్తే, ఈరోజు బీటీ (బంగారు తెలంగాణ) బ్యాచ్ రాజ్యమేలుతోందని,ఆనాడు నిండా అప్పుల్లో మునిగిన కేసీఆర్, ఈరోజు వంద కోట్లతో సొంత విమానం ఎట్లా కొన్నారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన సమయంలో ఫైనాన్స్ కట్టలేదని కేసీఆర్ చైతన్య రథాన్ని తీసుకుపోయారని, అలాంటి వ్యక్తి కోట్ల రూపాయలు పెట్టి కొత్త విమానం ఎట్లా కొన్నాడో, మునుగోడులో ఒక్కో ఓటుకు రూ. 40 వేలు ఎట్లా ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ప్రజలు ఆలోచించాలని సంజయ్ పిలుపునిచ్చారు.

Next Story