రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరి సరిగ్గా లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. అందుకు నిరసనగా రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇది చాలా బాధాకరమే, అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపట్ల నిరసన తెలియజేయడానికి ఇదే ఉత్తమమైన మార్గంగా భావించామని అన్నారు. తమ నిరసనను బహిరంగ లేఖ ద్వారా నేరుగా ప్రధానికి తెలియజేస్తున్నా అని కేసీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా సీయం కేసీఆర్ నాలుగు పేజీల బహిరంగ లేఖను ప్రధానికి విడుదల చేసారు.