మీ మాటల్లో విషం తప్ప విషయం లేదు - హరీశ్ రావు

Telangana Min Harish Rao Fires on BJP Leaders

By -  Nellutla Kavitha |  Published on  4 July 2022 4:18 PM IST
మీ మాటల్లో విషం తప్ప విషయం లేదు - హరీశ్ రావు

రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో దేశానికి, తెలంగాణకు ఎదో నిర్దేశనం చేస్తారనుకుంటే ప్రజలకు నిరాశే మిగిలిందని, అధికార యావ, కేసీఆర్ నామ స్మరణ తప్ప మరేమీ కనిపించలేదనా అన్నారు మంత్రి హరీశ్ రావు. విభజన చట్టం హామీల ఊసే లేదని, బీజేపీ దగ్గర విషం తప్ప విషయం లేదు అని మరోసారి రుజువైందని ఆయన అన్నారు.

అమిత్ షా నీళ్లు నిధులు నియామకాల గురించి మాట్లాడారని, అమిత్ షాకుతో వస్తే, ఏ జిల్లాకు అయినా వెళదాంనీళ్లు ఎలా వచ్చాయో తెలుస్తుంది అన్నారు హరీశ్. పంజాబ్ తర్వాత అత్యధిక ధాన్యం పండించింది తెలంగాణే అని నీతి ఆయోగ్ లెక్కలు చెబుతున్నాయని అన్నారు. అమిత్ షా తన వ్యాఖ్యలతో తెలంగాణ రైతులను అవమానించారని అన్నారు.

నిధులు వచ్చింది నిజం, నియామకాలు జరిగాయన్నది నిజం, తాము ఏదీ చెప్పినా ఆధారాలతో చెబుతామని, నిధులు ఖర్చు పెట్టనిదే మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. తలసరి ఆదాయం ఇపుడు 2 లక్షల 78 వేల రూపాయలకు పెరిగిందని, తెలంగాణ వాటా 4 శాతం నుంచి 4.9 శాతానికి పెరిగిందని, సంపద పెంచాం గనుకే తెలంగాణలో సంక్షేమం డబుల్ ఇంజిన్ సర్కార్ ల కన్నా ఎక్కువ ఉందని అన్నారు హరీశ్.

నియామకాలు జరిగాయా అని ప్రశ్నిస్తున్న అమిత్ షా బీజేపీ ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడరు, దమ్ముంటే 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో అమిత్ షా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు హరీశ్ రావు. లక్షన్నర ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేశామని, లక్షా 32 వేలు భర్తీ చేశాం.91 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోందని, తెలంగాణ ఉద్యమాల గడ్డ అమిత్ షా ఎదో చెబితే నమ్మడానికి సిద్ధంగా ఎవరూ లేరని అన్నారు.

Next Story