యశ్వంత్ సిన్హాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము - కేటీఆర్
We Support Yashwant Sinha As Presidential Candidate- Min KTR
By - Nellutla Kavitha |
భారతదేశంలో నరేంద్ర మోడీ పరిపాలన లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే యశ్వంత్ సిన్హా కు టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో యశ్వంత్ సిన్హా కు మద్దతు ప్రకటించి, నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎంపీ.లకు దశా నిర్ధేశం చేసారు కేటీఆర్. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ బద్దంగా ఉన్న సంస్థలను వేట కుక్కల్లా వినియోగించుకుంటూ ప్రజాస్వామ్యం
ను అపహాస్యం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య భారతదేశం ఎటువైపు నుండి ఎటు వెళ్తుందో గమనించాలని ఆయన కోరారు. టిఆర్ఎస్ పార్టీ గిరిజనులకు వ్యతిరేకం కాదని, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్రపతి అభివృద్ధి ద్రౌపది ముర్ము అంటే తమకు గౌరవం ఉందని, తాము బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామన్నారు. తెలంగాణకు ఏం చేశారని హైదరాబాద్ లో బీజేపీ నాయకులు సమావేశం నిర్వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గిరిజనుల మీద ప్రేమ ఉంటే పోలవరంలో మునిగిన 7మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు.
జనాభా ప్రకారం గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా ఇంత వరకు పట్టించుకోలేదన్నారు. తెలంగాణకు ట్రైబల్ యూనివర్సిటీ, జిల్లాకో నవోదయ విద్యాలయం, ఐటీఐఆర్, మెడికల్ కాలేజీ, రైల్వే కోచింగ్ సెంటర్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మంజూరు చేయాలన్నారు. వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి రూ.3,6,57,97 కోట్లు తెలంగాణ ప్రభుత్వం చెల్లించిందని, కేంద్రం తెలంగాణకు ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, నామా నాగేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, బీబీపాటిల్, తదితరులు పాల్గొన్నారు.