ఎవరు ఔనన్నా కాదన్నా విశాఖే పరిరాలనా రాజధాని - ఎంపీ విజయసాయి రెడ్డి

YSRCP MP VijayaSai Reddy On Executive Capital

By -  Nellutla Kavitha
Published on : 23 Jun 2022 8:00 PM IST

ఎవరు ఔనన్నా కాదన్నా విశాఖే పరిరాలనా రాజధాని - ఎంపీ విజయసాయి రెడ్డి

ఎవరు అడ్డుపడినా, ఎవరు అవునన్నా, కాదన్నా విశాఖ ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ గా మారుతుందని వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలకిందులుగా తపస్సు చేసినా దీన్ని ఆపే శక్తి ఆయనకు లేదన్నారు విజయసాయి. కొన్ని అనివార్య కారణాలవల్ల విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు ఆలస్యం అవుతుందని, తప్పకుండా ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ విశాఖకు మారుతుందని విజయసాయి రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని విశాఖలో అన్నారు విజయసాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలకిందులుగా తపస్సు చేసినా పరిపాలన రాజధాని రావడం ఆగదని ఆయ‌న చెప్పారు. తప్పకుండా ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ విశాఖకు మారుతుందని విజయసాయి రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికలో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న విషయంపై పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని ఆయ‌న చెప్పారు. అధినేత ఆదేశాల ప్రకారమే తామంతా నడుచుకుంటామన్నారు ఎంపీ విజయసాయి.

Next Story