ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ - అసలేమయింది ?!
Bollywood Star Heroine Hospitalised In Hyderabad
By - Nellutla Kavitha | Published on 14 Jun 2022 6:44 PM IST
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోన్ అస్వస్థత కు గురై హాస్పిటల్ లో చేరారన్న వార్త ఈరోజు వెలుగులోకి వచ్చింది. ప్రాజెక్ట్ కె షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉన్న దీపిక ఈ ఆదివారం ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టుగా సమాచారం. హార్ట్‌బీట్ పెరగడంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్య బృందం ఆమెను అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు చెప్తున్నారు.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రంలో దీపిక కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ఇదే సినిమా షూటింగ్‌లో ఉండగా ఒక్కసారిగా ఆమె హార్ట్‌రేట్ పెరగడంతో చిత్ర బృందం ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో డిశార్చి చేసి, ఒక హోటల్‌లో అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అయితే దీపిక పర్సనల్ టీం మెంబర్లు మాత్రం ఇప్పటికీ ఈ విషయం పై అధికారికంగా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.
ప్రభాస్ సరసన దీపికా పడుకోన్ నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా వైజయంతీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటుగా దీపిక షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా, హృతిక్ రేషన్ తో కలిసి ఫైటర్ అనే మరో చిత్రం కోసం కూడా ప్రస్తుతం పనిచేస్తోంది.