గోపీచంద్ తాజా ప్ర‌య‌త్నం వ‌ర్క‌వుట్ అవుతుందా..?

By Newsmeter.Network  Published on  15 Dec 2019 12:49 PM IST
గోపీచంద్ తాజా ప్ర‌య‌త్నం వ‌ర్క‌వుట్ అవుతుందా..?

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాని ‘యు టర్న్‌’మూవీని నిర్మించిన‌ శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 14 నుండి ప్రారంభం అయింది.

హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందే ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశి నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తుండగా భూమిక, రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. మొదటి షెడ్యూల్ గా అజిజ్ నగర్ లో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

గోపిచంద్ కెరీర్ లోనే ఇది హై బడ్జెట్ ఫిలిం. మా బేనర్ కి మరోప్రెస్టీజియస్‌ మూవీ అవుతుంది. గోపి చంద్ సరసన తమన్నా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మొదటి షెడ్యూల్ అనంతరం కంటిన్యూ గా రాజమండ్రి, ఢిల్లీ షెడ్యూల్స్ పూర్తి చేసి ఈ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం అని నిర్మాత తెలియ‌చేసారు. వ‌రుస ప‌రాజ‌యాల‌తో కెరీర్ లో బాగా వెన‌క‌బ‌డిన గోపీచంద్ చేస్తున్న ఈ తాజా ప్ర‌య‌త్నం వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని ఆశిద్దాం.

Next Story