హైదరాబాద్ : టాలీవుడ్ యువ హీరో నితిన్ త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. గ‌తంలో నితిన్ ఓ హీరోయిన్ తో ల‌వ్ లో ప‌డ్డాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ నితిన్ ప్రేమ గురించి ఎలాంటి వార్త బ‌య‌ట‌కు రాలేదు. తాజాగా నితిన్ త్వ‌ర‌లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు అంటూ జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇంత‌కీ పెళ్లి కూతురు ఎవ‌రు..? అనేది ఆస‌క్తిగా మారింది. అయితే.. అమ్మాయి ఎవ‌ర‌నేది లీక్ అవ్వ‌లేదు కానీ తెలుగు అమ్మాయే అని తెలిసింది. మ‌రో విశేషం ఏమిటంటే..ఇది ప్రేమ వివాహం అట‌. అవును.. గ‌త కొంత కాలంగా నితిన్ ప్రేమ‌లో ఉన్నాడ‌ని, ఆ విష‌యం ఇరు కుటుంబాల‌కు చెప్ప‌డం..అంగీక‌రించ‌డం జ‌రిగింద‌ని టాక్ వినిపిస్తోంది. ఇంత‌కీ పెళ్లి ఎప్పుడు..? ఎక్క‌డ? అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ లో విదేశాల్లో వీరి వివాహం జరగనున్నట్టు సమాచారం. దుబాయ్ లో ఈ పెళ్లి జరగవచ్చని, ఈ పెళ్లికి కుటుంబసభ్యులు, కొందరు సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలిసింది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్త‌ల పై నితిన్ ఇంకా స్పందించ‌లేదు. మ‌రి ఈ న్యూస్ నిజ‌మో కాదో నితిన్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.