నాడు అల్లు అర్జున్ - నేడు సాయితేజ్

By Newsmeter.Network  Published on  14 Dec 2019 5:51 AM GMT
నాడు అల్లు అర్జున్ - నేడు సాయితేజ్

తెలుగునాట సిక్స్ ప్యాక్ ఓ ట్రెండ్‌గా మారింది. ఈ ట్రెండ్ ఎప్ప‌టి నుంచి అంటే.. అల్లు అర్జున్ తో పూరి జ‌గ‌న్నాథ్ దేశ‌ముదురు సినిమాలో సిక్స్ ప్యాక్ చేయించిన‌ప్ప‌టి నుంచి. ఆత‌ర్వాత చాలా మంది హీరోలు సిక్స్ ప్యాక్ చేసారు. ఇప్పుడు ఈ జాబితాలో మెగా హీరో సాయితేజ్ కూడా చేరాడు. అవును.. మెగాస్టార్ మేన‌ల్లుడు సాయి తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తోన్న 'ప్రతీ రోజు పండ‌గే' ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నెల 20న ఈ సినిమా రిలీజ్ కానుంది. గీతా ఆర్ట్స్ సంస్ధ నిర్మించిన‌ ఈ మూవీలో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ లో సాయి తేజ్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నాడు. సాయి తేజ్ హోమం చేస్తుండగా వచ్చే యాక్షన్ సీన్, ఆ సీన్‌లో హీరో షర్ట్ లేకుండా ఫైట్ సీక్వెన్స్ లో సిక్స్ ప్యాక్ లొ తేజ్ కనిపిస్తాడు. ఫిట్‌నెస్‌ ట్రైనర్ సాయంతో వర్కౌట్ క్లాసెస్‌ అటెండ్ అయ్యి ఈ లుక్ కు మారాడు సాయితేజ్.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్‌ నిర్మాత‌గా ఈ సినిమా రూపొందింది. ఇందులో సాయితేజ్ కి జంట‌గా రాశీఖ‌న్నా న‌టించింది. ఈ చిత్రంలోని పాట‌లు, టీజ‌ర్, ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న ల‌భించింది. మంచి ఊపు మీదున్న ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించారు. మ‌రి.. బిగ్ స‌క్స‌స్ కోసం ఎదురు చూస్తున్న సాయితేజ్ కి ఈ సినిమా ఆశించిన విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

Next Story
Share it