టాలీవుడ్ దర్శకుడు ఎన్.బి చక్రవర్తి కన్నుమూత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2020 5:09 PM IST
టాలీవుడ్ దర్శకుడు ఎన్.బి చక్రవర్తి కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. అనేక హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు ఎన్‌.బి. చక్రవర్తి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారని బీఏ రాజు ట్వీట్ చేశారు. సంపూర్ణ ప్రేమాయణం, కత్తుల కొండయ్య, నిప్పులాంటి మనిషి , కాష్మోరా వంటి చిత్రాలు తెరకెక్కించారు. సీనియర్ దర్శకుడి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.



Next Story