ఆయ‌న్ను చూసి.. అన‌సూయ మ‌రీ అంత‌లా జ‌డుసుకుందా..?

By Newsmeter.Network  Published on  27 Dec 2019 12:39 PM IST
ఆయ‌న్ను చూసి.. అన‌సూయ మ‌రీ అంత‌లా జ‌డుసుకుందా..?

స‌మాజంలో ఏ చిన్న సంఘ‌ట‌న జ‌రిగినా వెంట‌నే స్పందించ‌డం యాంక‌ర్‌ అన‌సూయ త‌త్వం. త‌న శ‌రీరాకృతిపై, డ్రెస్సింగ్ స్టైల్‌పై కామెంట్లు చేసే వారిని సైతం చీల్చిచెండాడుతుంది. అటువంటి అన‌సూయ ఓ వ్య‌క్తి పేరు చెబితే చాలు వెన‌క‌డుగు వేస్తోంది. త‌న పెదాల‌పై చిరున‌వ్వును సైతం మాయం చేసేస్తోంది. ఇంత‌కీ ఆ వ్య‌క్తి ఎవ‌రు..? అన‌సూయ‌ను భ‌య‌పెట్టిన సంద‌ర్భం ఏమిటి..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ స్టోరీని చ‌ద‌వాల్సిందే మ‌రీ..!

అయితే, ప్ర‌స్తుతం సెల‌బ్రిటీ రేంజ్‌ను ఎంజాయ్ చేస్తున్న అన‌సూయ ఒకానొక స‌మ‌యంలో న్యూస్ రీడ‌ర్‌గాను, వ్యాఖ్యాత‌గానూ వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. నూత‌న న‌టీన‌టుల‌తో ప్రారంభ‌మైన జ‌బ‌ర్ద‌స్త్ షో కాస్తా అన‌సూయ స్థాయిని మ‌రింత పెంచింది. ఎంత‌లా అంటే బుల్లితెర నుంచి వెండి తెర‌పై కీల‌క పాత్ర వ‌ర‌కు అని ఒక్క మాట‌లో చెప్పొచ్చు. ఆ క్ర‌మంలోనే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రంగ‌స్థ‌లం చిత్రంలో సినీ జ‌నాల‌కు గుర్తుండిపోయే రంగ‌మ్మ‌త్త వంటి క్యారెక్ట‌ర్‌ను ద‌క్కించుకోగ‌లిగింది.

నెగిటివ్ క్యారెక్ట‌రే అయినా

రంగ‌స్థ‌లం చిత్రానికి ముందు.. ఆ త‌రువాత కూడా అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌గా తెర‌కెక్కిన చిత్రాలు చాలానే ఉన్నాయి. వాటిలో క్ష‌ణం ఒక‌టి. ఆ చిత్రంలో అన‌సూయ న‌ట‌న అద్భుత‌మ‌నే చెప్పాలి. నెగిటివ్ క్యారెక్ట‌రే అయినా, తాను త‌ప్ప మ‌రెవ్వ‌రు ఆ పాత్ర‌కు స‌రిపోర‌నే విధంగా న‌టించి సినీ జ‌నాల‌ను మెప్పించింది. ఇదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియా ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు తాను చేస్తున్న‌ షోల వివ‌రాలు చెబుతూ అభిమానుల సంఖ్య‌ను అంత‌కంత‌కు పెంచుకుంటూ పోతుంది.

ఇదిలా ఉండ‌గా, న‌టి క‌మ్ న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా, అన‌సూయ జ‌డ్జీలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌బ‌ర్ద‌స్త్ షోలో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. సాధార‌ణంగా హైప‌ర్ ఆది స్కిట్ అంటేనే న‌వ్వులు ఓ రేంజ్‌లో ఉంటాయి. కానీ, అన‌సూయ మాత్రం ఒక్క‌సారిగా త‌న న‌వ్వును ఆపేసి.. నేను న‌వ్వ‌లే.. నేను న‌వ్వ‌లే అంటూ మైక్‌ను త‌న మౌత్ ద‌గ్గ‌ర‌కు లాక్కొని మ‌రీ చెప్ప‌డం కాస్త విడ్డూరంగానే అనిపించినా. అన‌సూయ అలా చెప్ప‌డం వెనుక చాలా పెద్ద రీజ‌నే ఉంద‌ని సినీ జ‌నాలు అంటున్నారు.

కాగా, స్కిట్‌లో భాగంగా టీమ్ లీడ‌ర్ హైప‌ర్ ఆది ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు డూమ్ మాదిరి ఉన్న క‌మెడియ‌న్ న‌వీన్‌ను.. అలాగే రామ్‌గోపాల్‌వ‌ర్మ‌లా ఉన్న మ‌రో క‌మెడియ‌న్‌ను ఉద్దేశిస్తూ పంచ్ ప్రాస‌లు వ‌దులుతాడు. ముందుగా న‌వీన్‌ను ఉద్దేశించి ఈయ‌న రామారావుగారి నుంచి ఆయ‌న మ‌న‌వ‌డి వ‌ర‌కు అంద‌రి మ‌న‌సుల‌ను గెలిచాడు. కానీ, ఈయ‌న మాత్రం రామారావుగారి ద‌గ్గ‌ర్నుంచి ఆయ‌న మ‌న‌వ‌డి వ‌ర‌కు అంద‌రి మ‌న‌సుల‌ను గెలికాడు అంటూ రామ్‌గోపాల్ వ‌ర్మ డూప్ మాదిరి ఉన్న కమెడియ‌న్‌ను ఉద్దేశిస్తూ హైప‌ర్ ఆది పంచ్ పేల్చాడు.

ఇలా హైప‌ర్ ఆది కామెడీకి ప‌క్క‌నే ఉన్న రోజా న‌వ్వులు చిందిస్తూ ఉండ‌గా, అన‌స‌య మాత్రం సైలెంట్ అయిపోయింది. ఇలా అన‌సూయ త‌న పెద‌వుల‌పై చిరున‌వ్వును ఆపేయ‌డానికి గ‌ల కార‌ణం గ‌తంలో రామ్‌గోపాల్ వ‌ర్మ‌పై, త‌న‌పై వ‌చ్చిన వ‌దంతులే కార‌ణమ‌ట‌. ఆ స‌మ‌యంలో అన‌సూయ‌పై, రామ్‌గోపాల్‌వ‌ర్మ‌పై రూమ‌ర్లు చాలానే వ‌చ్చాయ‌ని, వాట‌న్నిటిని త‌న ఫ్యామిలీ స‌పోర్టుతో ఎదుర్కోగ‌లిగానంటూ ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అన‌సూయ ఆ విష‌యాల‌న్నింటిని రివీల్ చేసింది కూడా. ఏదేమైనా గ‌తం గ‌త‌హాః అంటూ జీవితంలో ముందుకెళ్లాలంటూ అన‌సూయ‌కు ఆమె అభిమానులు స‌ల‌హా ఇస్తుండం విశేషం.

Next Story