భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు.. వరుసగా పదో రోజు పెంపు
By సుభాష్ Published on 16 Jun 2020 7:54 AM GMTదేశ వ్యాప్తంగా పెట్రోల ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా పదో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తాజాగా మంగళవారం లీటర్ పెట్రోల్ పై 48 పైసలు, డీజిల్ పై 57పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.73 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 75.19కి చేరుకుంది. రోజురోజుకు ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. కాగా, లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తుండటంతో ఆయిల్ ధరలకు డిమాండ్ బాగా పెరిగింది.
తాజాగా చమురు ధరలపై లీటర్‌కు రూ.2చొప్పున ధరలు పెంచుతున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆదాయం తగ్గిపోయిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నట్లు గుజరాత్ సర్కార్ వెల్లడించింది. పెరిగిన ధరలు ఈ రోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయని గుజరాత్ ముఖ్యమంత్రి నితిన్ పటేల్ తెలిపారు. దీంతో గుజరాత్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.73.88 ఉండగా, డీజిల్ రూ.72.12కు చేరింది.
నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు
♦ హైదరాబాద్ - పెట్రోల్ రూ.79.65, డీజిల్ రూ.73.49
♦ ఢిల్లీ - పెట్రోల్ రూ. 76.73, డీజిల్ రూ. 75.19
♦ ముంబాయి - పెట్రోల్ రూ.83.62, డీజిల్ రూ.81.00
♦ చెన్నై - పెట్రోల్ రూ.80.37, డీజిల్ రూ.73.17
♦ బెంగళూరు - పెట్రోల్ రూ.79.22 డీజిల్ రూ.71.49