ప్రేమించిన అమ్మాయి కోసం వెతుకుతూ పాక్ సరిహద్దు దాటాడు... ఆ తర్వాత ఏమైందటే..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Nov 2019 12:16 PM ISTముఖ్యాంశాలు
- ఇద్దరు భారతీయులను అరెస్ట్ చేసిన పాక్ పోలీసులు
- భారతీయుల అరెస్ట్‌పై రక్షణశాఖ, విదేశాంగ శాఖ, హోంశాఖ సమావేశం
హైదరాబాద్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న బహవాల్‌పూర్‌లో ఈ నెల 14న ఇద్దరు భారతీయులను పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు భారతీయుల్లో ఒకరు విశాఖపట్నంకు చెందిన ప్రశాంత్. మరోకరు మధ్యప్రదేశ్‌కు చెందిన హరిలాల్ ఉన్నారు. ప్రశాంత్ హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ప్రశాంత్ బెంగళూర్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కోసం ప్రశాంత్ పాక్ సరిహద్దులు దాటినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పాస్‌పోర్ట్, వీసా లేకుండా పాకిస్తాన్‌లోని చోలిస్తాన్ ఎడారిలో ప్రవేశించే ప్రయత్నం చేయడంతో బహావల్‌పూర్ వద్ద వీరిని పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ విషయమై ప్రశాంత్ తండ్రి బాబురావు పలు కీలక విషయాలు తెలిపారు. తన ప్రేమికురాలు స్వప్నిక కోసం తమతో గొడవపడ్డాడని.. ఈనేపథ్యంలో తమకు రెండేళ్ల నుంచి కొడుకు ప్రశాంత్ కనిపించడంలేదని తెలిపారు. అయితే ప్రశాంత్ మాత్రం పాక్‌కు ఎందుకు వెళ్లాడో తమకు తెలియదని బంధువులు పేర్కొన్నారు. ప్రశాంత్ పూర్తిగా మతిస్థిమితం కోల్పోయాడని అతని తండ్రి వాపోయారు. ఈ మేరకు మాదాపూర్ పోలీసులకు బాబురావు ఫిర్యాదు చేశారు. ఎలాగైన తమ కొడుకు ప్రశాంత్ క్షేమంగా తీసుకురావాలని తండ్రి బాబురావు వేడుకున్నారు. కాగా ప్రశాంత్ మాట్లాడిన 1.03 నిమిషాల వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
�
ప్రశాంత్ తండ్రి బాబురావు.
పాకిస్తాన్‌లో అరెస్ట్ అయిన భారతీయులపై నేడు రక్షణశాఖ, విదేశాంగ శాఖ, హోంశాఖ సమావేశం కానుంది. ప్రశాంత్, హరిలాల్‌ను పాక్ చెర నుంచి విడిపించేందుకు వారి వివరాలు సేకరించే పాక్‌కు భారత్ పంపనుంది. భారత పౌరుల అరెస్ట్‌పై విదేశాంగ శాఖ, ఎంబసీ అధికారులతో చర్చిస్తామని కేంద్రహోంశాఖ సహాయకమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.