వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు బయట పెట్టిందన్నారు. చంద్రబాబు రాజకీయ దుర్భుద్ధితో మత విశ్వాసాలను ఎలా రెచ్చగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని, పొలిటికల్ డ్రామాలు చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పిందన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు రాజకీయ దుర్భుద్ధితో మత విశ్వాసాలను ఎలా రెచ్చిగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని, పొలిటికల్ డ్రామాలు చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పిందన్నారు. జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేసినట్టుగా చంద్రబాబు అసత్య ప్రచారం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు దేవుడంటే భక్తి ఉంటే ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు భయం, భక్తి రెండూ లేవు. ఆయనకు భయం, భక్తి ఉంటే.. ఇప్పటికైనా పశ్చాత్తాపం రావాలన్నారు వైఎస్ జగన్.
చంద్రబాబు నాయుడు, టీడీపీ చెప్పిన అబద్దాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. కోర్టులు వారిని తప్పుబడితే సోషల్ మీడియాలో మాపై తప్పుడు ప్రచారానికి తెరలేపారన్నారు. లడ్డూ విషయంలో కల్తీ జరగలేదని టీటీడీ ఈవోనే చెప్పారని, చంద్రబాబు చెప్పింది తప్పు అని ఈవోనే అంటున్నారన్నారు వైఎస్ జగన్.