తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ విరాళం

వైజాగ్ కు చెందిన మైత్రి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ శ్రీనివాస రావు శనివారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు కోటి రూపాయలను విరాళంగా అందించారు.

By Medi Samrat
Published on : 12 April 2025 8:12 PM IST

తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ విరాళం

వైజాగ్ కు చెందిన మైత్రి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ శ్రీనివాస రావు శనివారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు కోటి రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. దాతను చైర్మన్ అభినందించారు.

ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 10.30 గంటలకు రథోత్సవం ప్రారంభమైంది. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి గ్రామవీధుల్లో విహరించారు. భజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు.

Next Story