నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో రద్దీ
By Knakam Karthik Published on 19 Jan 2025 6:32 AM ISTనేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో రద్దీ
తిరుమల శ్రీవారి ఆలయంలో కొన్ని రోజులుగా సాగుతోన్న వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. పది రోజుల పాటు టీటీడీ భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించింంది. స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం చివరి రోజు కావడంతో తిరుమల సన్నిధిలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. మరో వైపు వైకుంఠ ద్వారా దర్శనాలు ముగియనున్న నేపథ్యంలో రేపు సర్వదర్శణానికి సంబంధించిన టోకెన్ల కేటాయింపును టీటీడీ రద్దు చేసింది. సర్వదర్శనానికి సంబంధించి నేరుగా క్యూలైన్లలోకి అనుమతి తెలపగా, ప్రోటోకాల్ మినహా వీఐపీ దర్శనాలు రద్దు చేసింది. కాగా ముందుగా టికెట్లు తీసుకున్న భక్తులకు మాత్రమ టీటీడీ అధికారులు వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే శ్రీవైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం శ్రీవారి భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకోగా, ఐదుగురు మహిళలతో పాటు ఓ పురుషుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ దర్శనాల కోసం తిరుపతి, తిరుమలలో టోకెన్ల జారీకి టీటీడీ ఏర్పాట్లు చేసింది. అయితే, భక్తులు ముందుగానే టోకెన్ జారీ కేంద్రాల వద్దకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో తిరుపతిలో శ్రీనివాసం, బైరాగిపట్టెడ, సత్యనారాయణపురం వద్ద ఉన్న టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తుల మధ్య భారీగా తోపులాట చోటు చేసుకుంది.