అంగప్రదక్షిణ టోకెన్లు దక్కించుకోవాలంటే ఇలా చేయండి..

అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పు తీసుకొచ్చింది.

By -  Medi Samrat
Published on : 17 Sept 2025 2:48 PM IST

అంగప్రదక్షిణ టోకెన్లు దక్కించుకోవాలంటే ఇలా చేయండి..

అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న FIFO (First In First Out) పద్ధతి స్థానంలో లక్కీ డిప్ విధానాన్ని ప్రవేశపెట్టింది. టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా విడుదల అవుతాయి. డిసెంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టోకెన్ల కోసం సెప్టెంబర్ 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లక్కీ డిప్ ద్వారా ఎంపికైన భక్తులకు ఈ టోకెన్లను కేటాయిస్తారు. శుక్రవారాలు మినహా ప్రతిరోజూ 750 టోకెన్లు, శనివారాల్లో 500 టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. భక్తులు తిరిగి ఈ సేవ పొందేందుకు గడువు 90 రోజులకు బదులు 180 రోజులుగా నిర్ణయించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భద్రతను దృష్టిలో ఉంచుకుని యాచకులు, అనధికార వ్యాపారులను తిరుమల నుండి టిటిడి తరలిస్తోంది. కళ్యాణకట్ట, ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో ఉన్న 82 మంది యాచకులు, అనధికార వ్యాపారులను గుర్తించి కిందకు పంపించారు. అనుమానితుల వేలిముద్రలు కూడా పరిశీలించారు. స్థానిక హోటళ్లు, టీ దుకాణాలు, చిల్లర దుకాణాల యజమానులు, తిరుమలలో పని ముగించిన తర్వాత, తమ వద్ద పనిచేసే వారికి తగిన వసతిని తిరుపతిలో కల్పించాలని పోలీసులు సూచించారు.

Next Story