తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న 62 లాట్ల వాచీలు జూన్ 02వ తేదీ నుండి 03వ తేదీ వరకు టీటీడీలో ఆన్ లైన్ ద్వారా ఈ – వేలం వేయనున్నారు. వీటిలో టైటాన్, సిటిజెన్, సొనాటా, రాగ, టైమ్స్ వన్, టైమ్స్, టైమెక్స్ తదితర స్మార్ట్ వాచీలు EA ID Nos 25106, 25107, 25108, 25109 ద్వారా ఈ వేలం వేయనున్నారు.
ఆసక్తి ఉన్న వ్యక్తులు వేలంలో పాల్గొనవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ–కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన బిడ్డర్లు వాచీల వేలంలో పాల్గొనటానికి అర్హులు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ (వేలములు) / ఏఈవో (వేలములు), టీటీడీ, హరేకృష్ణ మార్గ్, తిరుపతిలో https://konugolu.ap.gov.in లేదా www.tirumala.org లేదా ఫోన్ నెంబర్ 0877 – 2264429 ద్వారా సంప్రదించగలరు.