శ్రీవారి భక్తులకు శుభవార్త.. ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
TTD Released Special Darshanam Tickets.కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ప్రత్యేక
By తోట వంశీ కుమార్ Published on
6 July 2022 4:42 AM GMT

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ప్రత్యేక దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) విడుదల చేసింది. ఈ నెల 12,15,17 తేదీల్లో స్వామి వారిని దర్శించుకోవాలనే భక్తులు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. అలాగే సెప్టెంబర్ నెల కోటాకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రేపు(జూన్ 7) ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. భక్తులు టీటీడీ అధికార వైబ్‌సైట్‌లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.
ఇదిలా ఉంటే.. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. శ్రీ వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేసవి సెలవులు ముగుస్తుండడంతో గత రెండు రోజులుగా తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. దీంతో తిరుమలలోని వసతి కౌంటర్లలో 'నో వేకెన్సీ' బోర్డులు దర్శనమిచ్చాయి.
Next Story