శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల
TTD Released released December month quota Sarva Darshan tickets in online.కలియుగ దైవం
By తోట వంశీ కుమార్ Published on 27 Nov 2021 10:09 AM ISTకలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం దేశ, విదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తూనే ఉంటారు. కరోనా కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్యకు పరిమితి విధించింది. ఈ నేపథ్యంలో అన్ని రకాల దర్శనం టికెట్లను ఆన్‌లైన్ ద్వారానే విడుదల చేస్తున్నారు. తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన సర్వదర్శన టోకెన్లను టీటీడీ శనివారం విడుదల చేసింది.
రోజుకు 10 వేల చొప్పున టికెట్ల చొప్పున నెల రోజులకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లను అందుబాటులోకి తెచ్చారు. ఇక రేపు(ఆదివారం) ఉదయం 9 గంటలకు వసతి గదులకు సంబంధించి డిసెంబర్ నెల కోటాను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. సర్వదర్శనం టోకెన్లు, వసతి కోసం భక్తులు www.tirupatibalaji.ap.gov.in లో బుకింగ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. వర్చువల్ క్యూ పద్ధతిలో భక్తులకు టికెట్లు కేటాయించినట్లు వెల్లడించింది. ముందుగా వెబ్ సైట్‌లోకి ప్రవేశించినవారికి ముందుగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఇక తిరుమలకు వచ్చే భక్తులు ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలన్నారు.
10 నిమిషాల్లోనే ఖాళీ..
శ్రీవారి సర్వదర్శన డిసెంబర్ నెలకు సంబంధించిన టికెట్లను ఈ రోజు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. అయితే.. విడుదల చేసిన 10 నిమిషాల్లో వెబ్‌సైట్‌లో దర్శన టికెట్లు ఖాళీ అయినట్లుగా తెలుస్తోంది.
కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 24,379 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.99 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారికి 12,267 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.