భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలకు సిద్ధమైన టీటీడీ

వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ ‌చర్యలకు దిగింది.

By Medi Samrat
Published on : 15 April 2025 6:24 PM IST

భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలకు సిద్ధమైన టీటీడీ

వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ ‌చర్యలకు దిగింది. తిరుమలలోని ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని భూమనపై ధర్మకర్తల మండలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదులో తెలిపారు. దాణా పేరుతో కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడ్డారని, కాలం చెల్లిన మందులను వినియోగించి గోవుల మృతికి కరుణాకర రెడ్డి కారణమయ్యారని ఆరోపించారు. ఇవన్నీ అసత్యాలని టీటీడీ చెబుతోంది.

అంతకు ముందు కూడా టీటీడీ గోవుల మృతి వార్తలపై ఓ ప్రకటన ఇచ్చింది. టీటీడీ గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని తెలిపింది. మృతి చెందిన గోవులు పోటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావు, దురుద్దేశంతో కొద్ది మంది మృతి చెందిన గోవులు ఫోటోలను టీటీడీ గోశాలలో మృతి చెందినవిగా చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారాన్ని టీటీడీ ఖండిస్తోందని ప్రకటనలో తెలిపింది.

Next Story