ఆన్‌లైన్ లో లడ్డూలు బుక్ చేసుకోవచ్చని అవాస్తవ ప్రచారం

TTD Reacts About Fake News. టిటిడి వెబ్ సైట్ ద్వారా లడ్డూలు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమ‌ని

By Medi Samrat  Published on  12 Dec 2022 1:32 PM GMT
ఆన్‌లైన్ లో లడ్డూలు బుక్ చేసుకోవచ్చని అవాస్తవ ప్రచారం

టిటిడి వెబ్ సైట్ ద్వారా లడ్డూలు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమ‌ని.. భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులు దర్శన టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే పరిమితంగా అదనపు లడ్డూలు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకానీ దర్శనంతో సంబంధం లేకుండా లడ్డూలు టిటిడి వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చ‌రించింది.
Next Story
Share it