తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన వేద పాఠశాలలో ప్రవేశాలకు 2025 -26 విద్యాసంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠములు (పాఠశాలలు) 1. వేద విజ్ఞాన పీఠం, ధర్మగిరి, తిరుమల 2. కీసరగుట్ట, 3. విజయనగరం, 4. ఐ.భీమవరం, 5. నల్గొండ, 6. కోటప్పకొండలలో వివిధ కోర్సుల్లో ప్రవేశం కొరకు అర్హులైన బాలురు సంప్రదించవచ్చు.
వారికి వైదిక సంప్రదాయం ప్రకారం ఉపనయనం కాబడి, నిర్ణీత వయస్సు, విద్యా ప్రమాణాలు కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. సదరు పాఠశాలలలో బోధించే వివిధ కోర్సుల వివరాలు, అర్హత, ఆవశ్యకత, దరఖాస్తు, ఇతర వివరాలకు టీటీడీ వెబ్ సైట్ www.tirumala.org లో చూడవచ్చు. 2025 మే 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ అధికారులు ప్రకటనలో తెలిపారు.