ద్విచక్ర వాహనాలపై ఆంక్షలు విధించిన టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది.

By Medi Samrat  Published on  12 Aug 2024 5:37 PM IST
ద్విచక్ర వాహనాలపై ఆంక్షలు విధించిన టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఆగస్ట్ 12 నుండి సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయి. ఈ సమయంలో ఘాట్ రోడ్లపై ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు.

ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో పునరుత్పత్తి మరింత చురుగ్గా సాగే వన్యప్రాణులను సంరక్షించడంతో పాటు యాత్రికుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ తెలిపారు. ఈ చర్యలకు యాత్రికులు సహకరించాలని టీటీడీ కోరింది.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్టు 18వ తేదీన శ్రీవారి కల్యాణోత్సవమును టీటీడీ రద్దు చేసింది. ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రాకారంలో వైదిక కార్యక్రమాలు 17వ తేది రాత్రి వరకు జరగనున్నాయి. ఈ కారణంగా 18వ తేదీ కళ్యాణోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరుతోంది.

Next Story