నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ BR నాయుడు ఫైర్ అయ్యారు. వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. AI సాంకేతికతను వాడుకుని నా రూపం అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారు..ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనది, వక్రీకరించినది.. ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకం అన్నారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందన్నారు. వైసీపీ కి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు.. దీనిపై నేను చట్ట ప్రకారం ముందుకెళ్తానన్నారు. నాపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను తేల్చాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలేది లేదని హెచ్చరించారు.