వైకుంఠ ద్వార దర్శనం తేదీలను ప్రకటించిన టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు పది రోజుల పాటు పది రోజుల పాటు
By Medi Samrat Published on 16 Dec 2023 1:10 PM GMTతిరుమల శ్రీవారి ఆలయంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు పది రోజుల పాటు పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాన్ని టీటీడీ నిర్వహించనుంది. విశ్వ రక్షకుడు-శ్రీ మహా విష్ణువు పవిత్ర నివాసమైన వైకుంఠంలో ఒక రోజు భూమిపై ఒక సంవత్సరానికి సమానమైనదిగా పరిగణించబడుతుంది. ఆ ఒక్క రోజులోని పగటి 12 గంటలు ఉత్తరాయణంలోని ఆరు ఆరు నెలల కాలానికి సమానం కాగా మిగిలిన 12 గంటల రాత్రి భూమిపై మిగిలిన ఆరు నెలల దక్షిణాయనంతో సమానం. ఆ ఒక్క రోజులో, వైకుంటంలో తెల్లవారుజామున 120 నిమిషాలు భూమిపై ధనుర్మాస 30 రోజులకు సమానం.. శ్రీ మహా విష్ణువు బ్రహ్మ ముహూర్తంలో 40 నిమిషాల పాటు ఇతర దేవతలకు, ఋషులకు, భక్తులందరికీ దర్శనం ఇస్తాడు. ఇది పది రోజులకు సమానం. వైకుంఠద్వార దర్శనం ఈ రోజుల్లో దైవిక ఆనందాన్ని పొందడంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది.
తిరుమలలో గదులు పరిమితంగా ఉన్న కారణంగా ఈ పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో గదులు పొందాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేసింది టీటీడీ. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు పరిమితంగా మాత్రమే బ్రేక్ దర్శనం ఇవ్వనున్నారు. సిఫారసు లేఖలు స్వీకరించరు. వైకుంఠ ద్వార దర్శన ఫలితం 10 రోజుల పాటు ఉంటుంది. కావున విఐపిలు, ఇతర భక్తులు తొలిరోజైన వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే దర్శనం చేసుకోవాలనే తొందరపాటు లేకుండా పది రోజుల్లో ఏదో ఒకరోజు దర్శనం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని టీటీడీ కోరుతోంది.