ఇకనైనా అలాంటి ప్రెస్ మీట్లకు ఫుల్ స్టాప్ పడేనా.?

ఆంధ్రప్రదేశ్ లో లడ్డూ వ్యవహారంపై చర్చ జరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ టర్న్ తీసుకోవడం, ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకోవడం కొన్ని గంటల్లో జరిగిపోయాయి

By Medi Samrat  Published on  30 Sept 2024 5:18 PM IST
ఇకనైనా అలాంటి ప్రెస్ మీట్లకు ఫుల్ స్టాప్ పడేనా.?

ఆంధ్రప్రదేశ్ లో లడ్డూ వ్యవహారంపై చర్చ జరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ టర్న్ తీసుకోవడం, ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకోవడం కొన్ని గంటల్లో జరిగిపోయాయి. ముఖ్యంగా హిందువుల మనోభావాలను దెబ్బ తీశారు. కల్తీ జరిగింది ఖచ్చితంగా అని ఓ వైపు కూటమి ప్రభుత్వం చెబుతూ ఉండగా.. లాజిక్ లతో వైసీపీ కౌంటర్ అటాక్ చేసింది. ఇంతలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మతం గురించి కూడా ఏపీ రాజకీయాల్లో చర్చకు వచ్చేసింది. తాజాగా సుప్రీం కోర్టు కూడా ఈ వ్యవహారంపై స్పందించింది.

తిరుపతి లడ్డూ కల్తీ వివాదం రోజురోజుకు ముదురుతున్న నేపథ్యంలో దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచుతారని భావిస్తున్నాం, ఆంధ్ర ముఖ్యమంత్రి ఎందుకు ప్రెస్‌కి వెళ్లారు? అని కోర్టు ప్రశ్నించింది. ప్రఖ్యాత తిరుపతి లడ్డూలలో జంతువుల కొవ్వు వినియోగానికి సంబంధించిన వివాదానికి సంబంధించిన కొన్ని పిటిషన్లపై విచారణ జరిగింది.

కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ విషయాన్ని విచారించేసి చర్యల గురించి ఆలోచించకుండా నేతలు ప్రెస్ మీట్ లకు వెళ్లడం నిజంగా దురదృష్టకరం. ఇకనైనా అలాంటి ప్రెస్ మీట్లకు ఫుల్ స్టాప్ పడేనా అని తెలుగు ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు.

Next Story