నవంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే!
తిరుమలలో నవంబరు నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ విడుదల చేసింది.
By Kalasani Durgapraveen Published on 27 Oct 2024 11:30 AM GMTతిరుమలలో నవంబరు నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అక్టోబరు 30వ తేదీ దీపావళి సందర్భంగా సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు ఆస్థానం వైభవంగా జరుగనుంది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు.
నవంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు:
• నవంబరు 1న కేదారగౌరీ వ్రతం
• నవంబరు 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర
• నవంబరు 5న నాగుల చవితి, పెద్ద శేష వాహనం.
• నవంబరు 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర
• నవంబరు 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ
• నవంబరు 9న శ్రీ వారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్లైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయిగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర
• 10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం
• నవంబరు 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి
• నవంబరు 12న ప్రబోధన ఏకాదశి
• నవంబరు 13న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి
• నవంబరు 15న కార్తీక పౌర్ణమి
• 28న ధన్వంతరి జయంతి
• 29న మాస శివరాత్రి