తిరుమల శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

తిరుమలలో ఉచిత సర్వ దర్శనానికి 16 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 73,104 మంది స్వామివారిని దర్శించుకోగా 28,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు

By Medi Samrat  Published on  21 Sep 2024 4:15 AM GMT
తిరుమల శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

తిరుమలలో ఉచిత సర్వ దర్శనానికి 16 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 73,104 మంది స్వామివారిని దర్శించుకోగా 28,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.25 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. టిక్కెట్లు లేని భక్తులకు దర్శనానికి 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో తగినంత పార్కింగ్ లేకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులను నివారించడానికి, ముఖ్యంగా అక్టోబర్ 8న గరుడసేవ రోజున భారీగా వచ్చే భక్తుల రద్దీని దృష్ట్యా ఆర్టీసీ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. గత రెండేళ్లుగా తిరుమలలో వాహనాల రాకపోకలు పెరగడంతో వాహనాలకు పార్కింగ్‌ స్థలాల కొరత తీవ్రంగా ఉంది. తిరుమలలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి, గరుడ సేవ రోజున భక్తులను తిరుమలకు తరలించడానికి ఏపిఎస్ఆర్టీసీ తగిన సంఖ్యలో బస్సులను నడపాలని ఈవో సూచించారు. నాలుగు మాడ వీధులలో ఎప్పటికప్పుడు భక్తుల నుండి ఫీడ్‌బ్యాక్ సేకరణ, యాత్రికుల కొరకు మరిన్ని మే ఐ హెల్ప్ యూ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

Next Story