తిరుపతికి చేరుకున్న సిట్ బృందం

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న అంశంపై సీబీఐ పర్యవేక్షణలో విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

By Kalasani Durgapraveen  Published on  23 Nov 2024 5:15 AM GMT
తిరుపతికి చేరుకున్న సిట్ బృందం

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న అంశంపై సీబీఐ పర్యవేక్షణలో విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. తిరుపతికి సిట్ బృందం చేరుకుంది. నలుగురు డీఎస్పీలు, సీఐ, ఎస్ఐలతో కూడిన సిట్ బృందం తిరుపతి, తిరుమలలో పర్యటించనుంది.

తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్ లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. కల్తీ నెయ్యి కేసులో సిట్ బృందం పూర్తి స్థాయి విచారణ జరిపి సీబీఐ డైరెక్టర్‌కు నివేదిక సమర్పించనుంది. డీఎస్పీలు సీతారామాంజనేయులు, శివ నారాయణ స్వామి, కృష్ణమోహన్, వెంకట్రామయ్యలు నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ చేయనున్నారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌తో పాటు తిరుమలలో లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలు, ముడిసరుకు పరిశీలించనున్నారు.

Next Story