పోలీసుల అదుపులో భూమన అభినయ్ రెడ్డి

వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat
Published on : 17 April 2025 2:45 PM IST

పోలీసుల అదుపులో భూమన అభినయ్ రెడ్డి

వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ గోశాలలోకి అడుగు పెట్టేందుకు యత్నించిన అభినయ్ ను అదుపులోకి తీసుకున్నారు. గోశాలకు రావాలంటూ టీడీపీ చేసిన ఛాలెంజ్ ను స్వీకరించి గోశాలకు వచ్చామని, కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ తమను అడ్డుకుందని అభినయ్ రెడ్డి విమర్శించారు. సవాళ్లను స్వీకరించి వచ్చినప్పుడు పోలీసులతో తమను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

ఇక ఎంపీ గురుమూర్తితో పాటు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలతో కలిసి గోశాలకు వెళ్లేందుకు బయల్దేరిన భూమనను పోలీసులు అడ్డుకున్నారు. కేవలం గన్ మన్లతోనే గోశాలకు వెళ్లాలని, అనుచరులతో వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని కోరారు.

Next Story