మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది. మంచు ఫ్యామిలీ ఎపిసోడ్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూనే తిరుగుతోంది. కొన్ని రోజులుగా కుటుంబసభ్యులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటుడటం తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
రెండ్రోజుల క్రితం మంచు మనోజ్ తన భార్యత మౌనికతో కలిసి తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీకి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులపై ఏర్పడ్డాయి. తనపై, భార్య మౌనికపై దాడులకు పాల్పడ్డారం్టూ మంచు మనోజ్ చంద్రగిరి పోలీసులకు కంప్లయింట్ చేశారు. పర్మిషన్ లేకుండా యూనివర్సిటీలోకి చొచ్చుకెళ్లేందుకు మనోజ్ ట్రై చేశారని మోహన్ బాబు పీఏ చంద్రశేఖర్ అదే పోలీస్ స్టేషన్‌లో మరో కంప్లయింట్ చేశాడు.
ఇరు వర్గాల కంప్లయింట్స్‌ను పరిశీలించిన పోలీసులు ఇద్దరిపై కేసులు రిజిస్టర్ చేశారు. మోహన్ బాబు పీఏ చంద్రశేఖర్ ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా మంచు మనోజ్ ఏ-1గా, ఏ-2గా మౌనిక, మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. కాగా మనోజ్ ఫిర్యాదు కేసులో ఏ-1గా విజయ్ సింహా, ఏ-2గా సురేంద్ర, మరో ఏడుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌లో జర్నలిస్టుపై దాడి కేసులో ఇప్పటికే మంచు మోహన్‌బాబుపై కేసు నమోదు అయింది.