ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈ ఆత్మకథ చదవాల్సిన అవసరం ఉంది
Mahatma's Autobiography Satya Shodhana Book Launched by NV Ramana. మహాత్ముని ఆత్మకథ సత్యశోధన పుస్తకాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు.
By Medi Samrat Published on 19 Aug 2022 11:42 AM GMTమహాత్ముని ఆత్మకథ సత్యశోధన పుస్తకాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓ సామాన్యుడు మహాత్మునిగా మారిన కథే ఈ పుస్తకం అని పేర్కొన్నారు. ఆత్మకథల్లో అతిశయోక్తులు సాధారణంగా ఉంటాయి.. కానీ గాంధీ ఆత్మకథలో అన్ని వాస్తవాలేనని తెలిపారు. దేశ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో గాంధీ ఆత్మకథ చదవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. గాంధీ వారసులుగా మనం ఉండటం గర్వకారణం అని అన్నారు. తిరుపతిని గాంధీజీ రెండు సార్లు సందర్శించడం గొప్ప విషయం అన్నారు.
గాంధీజీ స్వాతంత్ర తేవడమే కాకుండా నైతికతను నేర్పారని.. యువత గాంధీని మరిచి పోతున్న సమయంలో కరుణాకర రెడ్డి సత్య శోధన పుస్తకాన్ని పునర్ ముద్రించడం గొప్ప విషయం అని అన్నారు. అ సందర్భంగా గాంధీ మిగిలిన పుస్తకాలను కూడా పునర్ ముద్రించాలని కరుణాకర రెడ్డిని కోరారు. విప్లవ భావాల పట్ల నేనూ విద్యార్థిగా ఉన్నపుడు కొంత ఆకర్షితుడయ్యాను. తన తప్పులను బహిరంగంగా ఒప్పుకున్న కరుణాకర రెడ్డి ని అభినందిస్తున్నానని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో కరుణాకర రెడ్డి నిర్మోహమాటంగా ఉంటూ నెట్టుకు రావడం గొప్ప విషయం అన్నారు.
కరుణాకర రెడ్డిని ప్రస్తుత పార్టీ కానీ.. గతంలో ఉన్న పార్టీ గానీ సరైన రీతిలో ఉపయోగించుకోలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్మొహమటంగా ఉండే కరుణాకర రెడ్డిని ఎందుకు పెద్ద పదవులు వరించలేదో అర్థం కాలేదని అన్నారు. రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని తెలిసినా.. ఎప్పుడూ కరుణాకర రెడ్డి నాకు ఆత్మీయుడు గానే ఉన్నారని తెలిపారు.
కరుణాకర రెడ్డి నాకు అపూర్వ సహోదరుడు, ఆత్మీయ సోదరుడని తెలిపారు. తెలుగు మహాసభలను టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి నిర్వహించారు.. మరోసారి తెలుగు మహాసభలను కరుణాకర రెడ్డి తిరుపతిలో నిర్వహించాలని కోరుకుంటున్నాని వ్యాఖ్యానించారు. నైతికతతో కూడిన రాజకియాలు చేసే ఉద్యమానికి కరుణాకర రెడ్డి నాయత్వం వహించాలని ఎన్వీ రమణ అభిలషించారు.
ఆధ్యాత్మికతను నైతికత తో జయించి రాజకీయాలను నడిపిన గొప్ప వ్యక్తి గాంధీజీ అని భూమన కరుణాకర రెడ్డి అన్నారు. గాంధీ ఆదర్శ జీవితం అందరికీ అందించాలని సత్యశోధనను ముద్రించానని తెలిపారు. విప్లవ రాజకీయాల నుంచి వచ్చిన నాకు.. గాంధీ ఆత్మకథను సర్దార్ గౌతు లచ్చన్న మొట్ట మొదట ఇచ్చారని.. గాంధీ సిద్ధాంతాలను చెప్పడమే కాదు.. ఆచరించి చూపిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
గాంధీ సిద్ధాంతాలు స్వాతంత్ర సమరం సమయంలో కన్నా ప్రస్తుతం ఎంతో అవసరం అని అన్నారు. విప్లవ రాజకీయాల నుంచి వచ్చిన నేను.. గతంలో గాంధీ సిద్ధంతాలను వ్యతిరేకించనందుకు క్షమాపణలు చెప్పారు. రాజకీయాల్లో మార్పు లేకుంటే సమాజానికి నష్టం అని అన్నారు. గాంధీ జీ ఆత్మకథను ప్రతి ఒక్కరూ చదవాలని కోరారు.