తిరుమలలో ఈ నెల 25న రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని మూడురోజుల పాటు సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో మరుసటి రోజు దర్శనాలకు జారీ చేసే ఈ టోకెన్లను ఈ నెల 23, 24, 25 తేదీల్లో జారీ చేయరు. ఈ నెల 23వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకెన్లు గురువారం జారీ చేయనున్నారు. తిరిగి 26వ తేదీన మరుసటి రోజు దర్శనానికి సంబంధించిన టోకెన్లను ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.