తిరుపతి కేంద్రంలోని భారత పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలచే సంయుక్తంగా నిర్వహించబడుతున్న స్టేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ మరియు అప్లైడ్ న్యూట్రిషియన్ 2025-2026 సంవత్సరానికి హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంద్రప్రదేశ్ టూరిజం అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బి.ఎస్.సి (హెచ్ అండ్ హెచ్.ఎ) 3 సంవత్సరాల డిగ్రీ కోర్సుకు ఇంటర్ లో 40 శాతం పైబడి మార్కులు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. క్రాఫ్ట్ కోర్సు ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ పెటిసరి కోర్సుకు ఎస్.ఎస్.సి పాసైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. సర్టిఫికెట్ కోర్సు ఇన్ ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్ కోర్సుకు ఎస్.ఎస్.సి పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కోర్సులకు వయోపరిమితి లేదని స్పష్టం చేశారు.కోర్సులు పూర్తయిన అనంతరం ఏపీ పర్యాటక శాఖ హోటళ్లు, ప్రముఖ ఫైవ్ స్టార్ హోటళ్లోఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.యువతీ యువకులకు వేరువేరుగా హాస్టల్ సదుపాయం ఉందన్నారు. దరఖాస్తులను ఆగస్టు 25 లోగా తిరుపతిలోని కళాశాలకు పంపాలన్నారు. దరఖాస్తులు www.sihmtpt.org నుంచి పొందవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు 9701343846, 9100558006, 9700440604 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. త్వరితగతిన అప్లై చేసుకొని ఈ సదావకాశాన్ని వినియోగించుకొని ఉపాధి పొందాలని ఏపీటీఏ సీఈవో ఒక ప్రకటనలో పేర్కొన్నారు.