తిరుమలలోని శ్రీవారి ఆస్థాన మండపం వద్ద ఈ రోజు(మంగళవారం) ఉదయం అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఆ స్థాన మండపం వద్ద నున్న దుకాణాల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఆరు షాపులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకున్నప్పటికి.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని షాపులు యజమానులు చెబుతున్నారు.
మరోవైపు తిరుమల పై కరోనా ఎఫెక్ట్ భారీగా పడింది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో దర్శనాల సంఖ్యను కుదించారు. దీంతో ఏప్రిల్ నెలలో భక్తుల సంఖ్య తగ్గడంతో పాటు ఆదాయం భారీగా తగ్గింది. ఏప్రిల్ నెల మొత్తం కలిపి కేవలం 9.05 మంది మాత్రమే శ్రీవారిని దర్శించుకున్నట్టు అధికారులు ప్రకటించారు. అలాగే హుండీ ఆదాయం 62 కోట్ల 62 లక్షల రూపాయలు వచ్చిందన్నారు. 4.61 లక్షలమంది తల నీలాలు సమర్పించుకున్నారు. అంటే మార్చి నెలతో పోలిస్తే ఆదాయం సగానాకి సగం పడిపోయింది. మార్చి నెలల్లో 16.27 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే.. హుండీ ఆదాయం 104 కోట్ల రూపాయల పైనే వచ్చింది.