తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ.. 6 కి.మీ మేర భక్తులు బారులు
Exceptional crowd of devotees in Tirumala.. 36 hours time for darshan of Srivaru. తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో తిరుమల భారీ సంఖ్యలో
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో తిరుమల భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. గత 4 రోజుల నుంచి తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వ దర్శానానికి 36 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుండటంతో.. స్వామి వారి దర్శనం 48 గంటలు పట్టే ఛాన్స్ ఉందని తెలిపారు. 38 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆరు కిలోమీటర్లకుపైగా క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, క్యూలైన్లు, సేవాసదన్, రాంభగీచ వరకు భక్తులు క్యూలైన్లలో నిలబడ్డారు. ఈ క్రమంలోనే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలకు వచ్చే భక్తులు తమ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవాలని, లేదంటే వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచించింది. నిన్న 83,452 మంది భక్తులు దర్శించుకోగా 50వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.27 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈనెల 21 వరకు స్పెషల్ దర్శనాలు రద్దు చేశారు. వీఐపీ బ్రేక్ , పిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేశారు.