తిరుమల వెంకన్న స్వామికి ఓ భక్తులు భారీగా కానుకును సమర్పించాడు. తమిళనాడుకు చెందిన భక్తుడు తంగదొరై భారీ కానుకును సమర్పించాడు. బంగారు శంఖు, చక్రలను విరాళంగా ఇచ్చాడు. వాటి విలువ రూ.2 కోట్లు ఉంటుంది. 3.5 కిలోమల బంగారంతో స్వామివారికి శంఖు, చక్రాలను చేయించినట్లు తంగదొరై వెల్లంచాడు.
బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో అదనపు ఈవోకు అభరణాలు అందజేశాడు. తంగదొరై గతంలోనూ శ్రీవారికి బంగారు, వజ్రాభరణాలను విరాళంగా ఇచ్చాడు. అందులో బంగారు కటి, వరద హస్తాలు, వడ్డాణం ఉన్నాయి.
తిరుమల శ్రీవారికి నిత్య ఎంతో విలువైన కానుకలు వస్తుంటాయి. బంగారం, వెండి అభరణాలతో పాటు వజ్రవైడుర్యాలను భక్తులు సమర్పించుకుంటారు. కొందరు భూములను రాసిస్తుంటారు. ఇప్పటకే చాలా మంది భక్తులు భారీ కానుకలు స్వామివారికి కానుకగా సమర్పించారు. ఆ విధంగా వివిధ రూపాల్లో వేంకటేశ్వస్వామికి భక్తులు కానుకలు సమర్పించి తమ నమ్మకాన్ని చాటుకుంటున్నారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం 54,479 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 24,446 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నట్లు టీటీడీ తెలిపింది. నిన్నశ్రీవారి హండీ ఆదాయం రూ.3 కోట్ల 44 లక్షలు వచ్చినట్లు దేవస్థానం తెలిపింది. మరో వైపు అలిపిరి దగ్గర స్వరదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు.ఇప్పటకే రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.