టీటీడీకి భారీ విరాళం అందించిన భక్తుడు

చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు, టీటీడీకి చెందిన ప్రాణదాన ట్రస్టుకు రూ.1.01 కోట్ల రూపాయల చెప్పున 2.02 కోట్లు విరాళంగా అందించారు.

By Kalasani Durgapraveen  Published on  24 Nov 2024 9:13 AM IST
టీటీడీకి భారీ విరాళం అందించిన భక్తుడు

చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు, టీటీడీకి చెందిన ప్రాణదాన ట్రస్టుకు రూ.1.01 కోట్ల రూపాయల చెప్పున 2.02 కోట్లు విరాళంగా అందించారు. శ్రీ వ్యాసరాజ మఠం పీఠాధిపతి విద్యాశ్రీ తీర్థ తరపున టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరికి చెక్కులను అందజేశారు. టీటీడీ అధికారుల నుంచి సంప్రదాయ స్వాగతం లభించగా, పీఠాధిపతితో పాటు భక్తుడు కూడా స్వామిని దర్శించుకున్నారు.

తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో పోలీస్, తిరుచానూరు పంచాయతీ అధికారులకు సూచించారు. డిసెంబర్ 6వ తేదీన నిర్వహించనున్న పంచమీ తీర్థం రోజున భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, పుష్కరిణిలో తోపులాటలు జరుగకుండా, ట్రాఫిక్ నిలిచిపోకుండా పోలీసులు, విజిలెన్స్ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల అనంతరం భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తిరుపతి వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అవసరమైన వైద్య బృందాలు, బారికేడ్లను పటిష్టంగా ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. భక్తుల తాకిడికి తగ్గట్టుగా అన్నప్రసాదాల పంపిణీ చేపట్టాలని, అవసరమైన శ్రీవారి సేవకులను ఏర్పాటు చేసుకుని భక్తులకు మరింత మెరుగ్గా సేవలు అందించాలని సూచించారు.

Next Story