పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనతో.. తిరుమల శ్రీవారి భక్తులకు తీవ్ర అవస్థలు..!

Concern of contract workers in Thirumala. తిరుమల తిరుపతి దేవస్థానంలో.. తమను టీటీడీ కార్పొరేషన్‌లో కలుపాలంటూ పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.

By అంజి  Published on  8 Dec 2021 8:23 AM GMT
పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనతో.. తిరుమల శ్రీవారి భక్తులకు తీవ్ర అవస్థలు..!

తిరుమల తిరుపతి దేవస్థానంలో.. తమను టీటీడీ కార్పొరేషన్‌లో కలుపాలంటూ పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఫలితంగా భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. గత వారం రోజులు కార్మికులు విధులు బహిష్కరించారు. తిరుమల కొండపై ఎఫ్‌ఎంఎస్‌ సర్వీసెస్‌ ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో.. శ్రీవారి దర్శనం కోసం వస్తున్న వేలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో పారిశుద్ధ్య పనులు ఆగడంతో.. చెత్త పేరుకుపోయి దుర్గంధంగా తయారవుతోంది. తమను టీటీడీ కార్పొరేషన్‌లో విలీనం చేయాలంటూ పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు.

సదరు కాంట్రాక్ట్‌ సంస్థ కొందరు తాత్కాలిక కార్మికులను నియమించి గదులను శుభ్రం చేయిస్తున్నప్పటికీ.. ఇది పూర్తి స్థాయిలో కష్టతరంగా మారింది. దుర్గంధం వస్తుండటంతో గదులను భక్తులకు కేటాయించడాన్ని టీటీడీ నిలిపేసింది. గదులపై కేటాయింపు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సమాధానం చెప్పే అధికారి కూడా కరువయ్యారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తగిన చర్యలు చేపట్టి, గదులను శుభ్రం చేయించి, గదులు ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు.

Next Story